ఐరన్ లోపం - లక్షణాలు - నివారణోపాయాలు

Telugu Lo Computer
0


రన్ లోపం వున్నవారిలో ఏ పనిచేయకుండానే అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పాలిపోయినట్లుగా కనిపించడం జరుగుతుంది. శరీరంలోని ఎర్ర రక్తకణాల్లో ఖనిజాల లోపం కారణంగా ఈ సమస్య వస్తుంది. దీంతో కణాలకు ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. ఐరన్ లోపం సమస్య ఉంటే తలనొప్పి, మైకం, తలతిరగడం, నాలుక నొప్పి, జుట్టు ఎక్కువగా రావడం, పేపర్, ఐస్ వంటివి తినాలనిపించడం వంటివి కూడా జరుగుతాయి.  ఐరన్ లోపం ఏర్పడడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఆకుకూరలు, మాంసం, ఐరన్ ఉండే ఫుడ్స్‌ని తక్కువగా తీసుకోవడం. ఆడవారికి పీరియడ్స్ టైమ్‌లో ఎక్కువగా బ్లీడింగ్ కారణంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది. పుండ్లు, అర్షమొలలు వంటిసమస్యల కారణంగా ఐరన్ తగ్గుతుంది. కొంతమందికి సరైన ఫుడ్ తీసుకున్నప్పటికీ బాడీ సరిగా అబ్జార్బ్ చేసుకోకపోతే ఈ సమస్య వస్తుంది. దీనికి ప్రేగు సంబంధిత సమస్యలు కారణమవ్వొచ్చు. దీంతోపాటు డెలివరీ తర్వాత బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఐరన్ లోపం తలెత్తుతుంది. ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు కూడా కండరాలకు ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటుంది. దీంతో ఐరన్ లోపం వస్తుంది. ఐరన్ లోపం వన్నవారికి వేయించిన శనగలు చాలా మంచివి. వీటితో పాటు బెల్లం ఇవి బెస్ట్ స్నాక్ ఐటైమ్. ఈ రెండింటి కాంబినేషన్ బాడీలో మ్యాజిక్‌ని చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్, ప్రోటీన్, ఖనిజాలు, సెలీనియం, ఫైబర్, విటమిన్ బి6లు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, ఐరన్ లోపాన్నే కాకుండా లివర్ ప్రాబ్లమ్స్, చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇది శోథ నిరోధక ప్రభావాలని కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు వేయించిన శనగలు, బెల్లాన్ని కలిపి తినకూడదు. నువ్వుల్ని మన వంటల్లో ఎక్కువగా వాడతాం. దీనిని సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. సాధారణంగా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఉంటాయి. వీటిని మనం లడ్డూల్లా చేసి తినడం, నువ్వుల కారంలా చేసి తినొచ్చు. వీటిని పొడిలా చేసి వంటల్లో వేసుకుని తినొచ్చు. రోజుకో టీస్పూన్ చొప్పున తినండి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలకి కారణమైన అనీమియాకి చెక్ పెట్టొచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)