అమెరికాలోని హ్యూస్టన్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం !

Telugu Lo Computer
0


మెరికాలోని హ్యూస్టన్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గంటకు 160 కి.మీ. వేగంతో పెనుగాలులు వీయడంతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరంలోని పలు ఏరియాలలో అంధకారం నెలకొంది. భారీ వర్షాలకు సిటీతో పాటు టెక్సస్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం ఏడుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. చెట్లు విరిగిపడడం, పలు చోట్ల గోడలు కూలిన ఘటనలలో పలువురికి గాయాలయ్యాయని వివరించారు. పెనుగాలుల కారణంగా సిటీలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా వీధులు నదులను తలపిస్తున్నాయి. హ్యూస్టన్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగా హ్యూస్టన్ లోని స్కూళ్లకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)