హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ప్రయాణికులతో నిండిన బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని వెలికి తీసుకువచ్చి, అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
బస్సు అదుపుతప్పి లోయలో పడి ఇద్దరు మృతి
June 17, 2025
0
Tags