అల్లం, నిమ్మరసం-అల్లం పానీయం - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


పొత్తికడుపు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా అనారోగ్యానికి దారితీస్తుంది. డైట్, లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ వంటి సమస్యలు వస్తాయి. పొత్తికడుపులో అనవసరమైన కొవ్వు పేరుకుపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు తగ్గించుకోకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బెల్లీ ఫ్యాట్ సమస్యను తగ్గించుకోవడానికి వ్యాయామం ఒక్కటే సరిపోదు. వ్యాయామంతో పాటు కొన్ని రకాల పానీయాలు కూడా తీసుకోవాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం నిమ్మరసం-అల్లం కలిపి తయారు చేసిన పానీయం అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం ఐదు రోజుల్లో ఫలితాలు చూస్తారు. అల్లంలోని జింజెరాల్, షోగాల్స్ శరీరంలోని అంతర్గత మంటను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఆకలి తగ్గుతుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల ఆకలి బాగా తగ్గుతుంది. ఒక గిన్నెలో నిమ్మరసం వేయండి. అల్లం చిన్న ముక్కలుగా చేసి అందులో మూడు కప్పుల నీళ్లు కలపండి. ఇప్పుడు మిశ్రమాన్ని 10-15 నిమిషాలు మరిగించాలి. రుచికి తేనెను కలుపుకోవచ్చు. దీన్ని రోజుకు మూడుసార్లు తాగితే కేవలం ఐదు రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది. ప్రతి రోజూ ఉదయం నిమ్మకాయ నీటిని తాగటం అలవాటు చేసుకోవటం వల్ల మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసుడు నీళ్లలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది. నిమ్మకాయ, అల్లం రసంతో తయారు చేసుకున్న నీటితో నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. పలుచటి మజ్జిగలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే నీరసం తగ్గి హుషారుగా ఉంటుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)