ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని మేరఠ్ జిల్లా, లోహియానా గర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆషియాన కాలనీలో షెహ్ జాద్ అనే వస్త్ర వ్యాపారి నివసిస్తున్నాడు. అయితే కొని రోజులుగా అతనికి తన తమ్ముడు అక్రమ్ కి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన అన్నని మాట్లాడాలి అని ఓ గదిలోకి అక్రమ్ తీసుకెళ్లి రాడుతో అన్న చాతి పైన కొట్టాడు అనంతరం గొంతు నులిమి చంపాడు. అయితే అక్రమ్ కు తల్లి, చెల్లి కూడా సహకరించారు. కాగా షెహజాద్ మృత దేహాన్ని ఫ్యాన్ కు ఉరివేసి ఆత్మహత్య గా చిత్రీకరించాలని ప్రయత్నించారు.  కాగా హత్య జరిగిన సమయంలో మృతుడి భార్య బిడ్డలు మేడపైన నిద్రిస్తున్నారు. భార్య బిడ్డల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు వారిస్తున్నా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా సోమవారం వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)