ఐటీ రీఫండ్స్ చెల్లింపు కోసం స్పెషల్​ కాల్​ సెంటర్​ !

Telugu Lo Computer
0


సెసీలకు రీఫండ్స్​ చెల్లించడంలో ఇన్​కంటాక్స్​ డిపార్ట్​మెంట్​కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సీబీడీటీ చైర్​పర్సన్​ నితిన్​ గుప్తా మంగళవారం వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుల బ్యాంకు అకౌంట్ల వాలిడేషన్​సమస్యలే దీనికి కారణమని పేర్కొన్నారు. దీంతో ఎసెసీలను చేరడం కోసం స్పెషల్​ కాల్​ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరలో ఈ సమస్యలు పరిష్కరించి, రీఫండ్​లు చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఎసెసీలకు చెందిన సరైన బ్యాంకు అకౌంట్లలో రీఫండ్​ను జమ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. 2010-11 నాటి పాత డిమాండ్స్​ఎసెసీలకు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నకు నితిన్​ గుప్తా వివరణ ఇచ్చారు. ఇన్​కంటాక్స్​ డిపార్ట్​మెంట్​ తన టెక్నాలజీని 2011 టైములో మార్చుకుందని, అప్పుడే పేపర్​బేస్డ్​ రిజిస్టర్ల నుంచి కంప్యూటర్లకు మారిందని ఆయన చెప్పారు. ఆ కారణం వల్లే కొంత మంది ఎసెసీలకు పాత డిమాండ్స్​ కనబడుతున్నాయని వివరించారు. కిందటేడాది నుంచే యూనిక్​ డిమాండ్​ మేనేజ్​మెంట్​ ఫెసిలిటేషన్​ సిస్టమ్​ను అమలులోకి తెచ్చామని, రీఫండ్స్​ ఆగిపోయిన ఎసెసీల కోసమే ఈ సిస్టమ్​ పని చేస్తోందని అన్నారు. పన్ను చెల్లింపుదారులందరికీ ఒక ఈ-మెయిల్​ పంపామని, అది అందిన నాటి నుంచి మూడు రోజులలోపు వారికి తమ డిపార్ట్​మెంట్​ కాల్​ సెంటర్​ నుంచి ఒక ఫోన్​ కాల్​ వస్తుందని అందులో పేర్కొన్నామని, ఆ విధంగా ఎసెసీల రీఫండ్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని గుప్తా చెప్పారు. మైసూరులోని కాల్​ సెంటర్​ ద్వారా కిందటేడాది 1.40 లక్షల రీఫండ్​ కేసులను పరిష్కరించగలిగినట్లు వెల్లడించారు. అయితే, తాము పంపే డిమాండ్​ను ఎసెసీ ఒప్పుకోవచ్చని లేదంటే కంటెస్ట్​ చేసేందుకూ వారికి అవకాశం ఉంటుందని గుప్తా చెప్పారు. తొలి దశలో కర్నాటక, గోవా, ముంబై, ఢిల్లీ, నార్త్​-వెస్ట్​ రేంజ్​ల కోసం కాల్​ సెంటర్​ పనిచేసేదని, ఇప్పుడు దానిని అన్ని ఇతర ప్రాంతాలు, సిటీల కోసమూ పనిచేయించనున్నామని వివరించారు. రీఫండ్స్​ ఆగిపోవడానికి సాధారణంగా రెండు కారణాలుంటాయని....ఒకటి ఎసెసీలు తమ బ్యాంకు అకౌంట్లను వాలిడేట్​ చేయకపోవడమని, లేదంటే ఆ ఎసెసీ అకౌంటుండే బ్యాంకు వేరే బ్యాంకులో మెర్జ్​ కావడమని గుప్తా చెప్పారు. కాకుంటే, ఎసెసీ వేరే ఏదైనా సిటీకి మారడం వల్ల ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లో మార్పు ఉండటం వల్ల కూడా రీఫండ్​ ప్రాసెస్​నిలిచిపోవచ్చని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)