గుమ్మడికాయలు ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగులను కలిగిన ఉంటాయి. వీటిల్లో ఔషధ గుణాలుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లలో లభించే తెలుపు, పసుపు, ఆకుపచ్చ గుమ్మడికాయలలో దాని రూపాన్ని బట్టి మాత్రమే కాదు, రుచి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. గుమ్మడికాయలో ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. గుమ్మడికాయలు మూడు రకాలు ఉన్నప్పటికీ, వేరువేరు రంగులు, ఆకారాలు కలిగి ఉంటుంది. వివిధ రంగులు, రూపాలు కనిపించే ఈ కూరగాయ ఔషధ గుణాలతో నిండి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. గుండ్రని గుమ్మడికాయ రకం పసుపు పొడవైన గుమ్మడికాయ కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీని రుచి కూడా కొద్దిగా భిన్నంగానే ఉంటుంది. మూడు రకాల గుమ్మడికాయలలో పసుపు రకం గుమ్మడికాయ పెద్దగా కొంచెం పొడవుగా ఉంటుంది. ఇది సాంకేతికంగా ఆకుపచ్చ గుమ్మడికాయ పండిన రూపం. ఇది పండిన తర్వాత ముదురు పసుపు లేదా నారింజరంగులోకి మారుతుంది. దీని రుచి కొద్దిగా తీపిగా ఉంటుంది. తెల్ల గుమ్మడికాయను హిందీలో పెధా అని ఇంగ్లీషులో ఆష్ గార్డ్ అనిపిస్తారు. ఇది గోరింటాకు రంగులో కనిపిస్తుంది ఆకుపచ్చో పసుపు గుమ్మడికాయ కంటే తెల్ల గుమ్మడి కాయలు ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ,మెగ్నీషియం, బాస్వరం, ఐరన్, ఫోలేట్,నియాసిన్, థియామిన్ వంటి పోషకాలు తెల్ల గుమ్మడికాయలు మంచి పరిమాణంలో కనిపిస్తాయి. అందుకే పసుపు ఆకుపచ్చ గుమ్మడికాయ కంటే తెల్ల గుమ్మడికాయ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడికాయలు - ఆరోగ్య ప్రయోజనాలు
July 31, 2025
0
Tags