నోటి దుర్వాసన - జామ ఆకులు

Telugu Lo Computer
0


నోటి దుర్వాసనతో ఇబ్బంది పడే జామ ఆకుతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. నోటి దుర్వాసనను పోగొట్టడం నుంచి అల్సర్స్, పిప్పి పన్ను సమస్యలకు జామ ఆకు పరిష్కారం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  జీర్ణ శక్తిని పెంచడానికి ఉపయోగపడే ఆకులలో జామ కూడా ఒకటి. మెటబాలిజం మెరుగవ్వాలన్నా, డయాబెటిస్ తగ్గాలన్నా, ఇమ్యూనిటీ పెరగాలన్నా అన్నింటికీ జామ ఆకు పరిష్కారం చూపిస్తుంది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ ఆకులలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. స్కిన్ ప్రొడక్ట్స్ లో జామ ఆకుల నుంచి తీసిన రసాన్ని వాడుతుంటారు. నాలుగు తాజా జామ ఆకులను శుభ్రం చేసుకొని తడిగా ఉన్నప్పుడు బాగా నూరుకోవాలి. వాటి పిప్పి నుంచి వచ్చే రసాన్ని ప్రత్యేకంగా ఓ గ్లాసులోకి తీసుకోవాలి. లేదా మిక్సీ పట్టినా సరిపోతుంది. పిప్పిని పూర్తిగా వడబోయాలి. తద్వారా వచ్చిన జ్యూస్ ని నోట్లో పోసుకోవాలి. కాసేపటి వరకూ ఈ జ్యూస్ ని అలాగే పట్టి ఉంచాలి. తరవాత పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఆయిల్ పుల్లింగ్ చేసినట్టుగానే జామ ఆకుల రసాన్ని పుక్కిలించాలి. ఇలా రోజూ ఉదయం సాయంత్రం చేస్తే నోటి దుర్వాసన అనేదే రాకుండా పోతుంది. అంతే కాదు. క్యావిటీతో ఇబ్బంది పడుతున్న వారూ సమస్య నుంచి బయటపడతారు. లేదా  ముందుగా ఓ గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. వాటిని బాగా మరిగించాలి. అవి మరుగుతుండగానే రెండు లేదా మూడు జామ ఆకులు అందులో వేయాలి. తరవాత రెండు లవంగాలు కూడా కలపాలి. ఇవి బాగా మరిగాక చివర్లో ఓ చిటికెడు పసుపు కలపాలి. సరైన విధంగా మరిగిన తరవాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఈ నీటిని వడబోయాలి. అవి కాస్త గోరు వెచ్చగా అయిన తరవాత నోట్లో పోసుకోవాలి. కాసేపటి వరకూ అలాగే ఉంచాలి. తరవాత పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా రోజూ రెండు లేదా మూడు సార్లు చేస్తే పిప్పి పన్ను సమస్య తీరిపోతుంది. అదే సమయంలో నోటిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే దుర్వాసన కూడా మటుమాయం అవుతుంది.​ చాలా మందికి అజీర్తి కారణంగా తచరూ నోట్లో పుండ్లు, పూత వస్తూ ఉంటాయి. ఎన్ని మందులు వేసుకున్నా కొన్ని సార్లు ఇది తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు జామ ఆకుతో పరిష్కరించుకోవచ్చు. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం లాంటి సమస్యలకూ ఇది చెక్ పెడుతుంది. వీటిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోట్లో ఉండే బ్యాక్టీరియాని పూర్తిగా తొలగిస్తుంది. పెదాలపై అల్సర్ వస్తే జామ ఆకుని పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని పూతపై పెట్టవచ్చు. ఇలా కూడా సమస్య తగ్గిపోతుంది. లేదా నీటిలో జామ ఆకులు వేసి మరిగించి ఆ నీళ్లతో పుక్కిలించాలి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఉండడం వల్ల చిగుళ్ల వాపు క్రమంగా తగ్గుతుంది. అంతే కాదు. దంతాల నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)