భాజపా తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ సుందర్‌

Telugu Lo Computer
0


మిళనాడు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ప్రముఖ సినీ నటి, భాజపా నాయకురాలు కుష్బూ సుందర్‌ నియమితులయ్యారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్‌ నాగేంద్రన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 14మంది నియమితులు కాగా.. ఈ జాబితాలో ఖుష్బూ సుందర్‌కు చోటు దక్కింది. అలాగే, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు, రాష్ట్ర కార్యదర్శులుగా 14 మందితో కూడిన జాబితాను నయనార్‌ నాగేంద్రన్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో షేర్‌ చేసుకున్నారు. ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా, భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)