ఉల్లిపాయ రసం డయాబెటిస్ రోగులకు అమృతం లాంటిదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి అనేక రకాల సహజ ఇంటి నివారణ చర్యలు ప్రయత్నించవచ్చని చెబుతున్నారు. దీంతో షుగర్ నార్మల్ గా ఉంచుకోవచ్చని పేర్కొంటున్నారు. ఉడికించిన ఉల్లిపాయ తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందంటున్నారు. డయాబెటిస్ రోగులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఉల్లిపాయ రసం తాగడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. దీని సహాయంతో, టైప్-1, టైప్-2 రోగులు ఇద్దరూ ఉపశమనం పొందవచ్చు. ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి, రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుందని పేర్కొంటున్నారు. ఉల్లిపాయను ఉడకబెట్టి, దాని రసం తీసి తాగితే, అది శరీరానికి డీటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ హోం రెమెడీతో, శరీరంలోని కేలరీలు తగ్గడం ప్రారంభమవుతుంది. రెండు మీడియం సైజు ఉల్లిపాయలను మెత్తగా కోసి మిక్సర్ గ్రైండర్‌లో వేసి, 1 కప్పు నీరు, చిటికెడు నల్ల ఉప్పు, 1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.. దీన్ని తాగడం ద్వారా శరీరానికి ఫైబర్, అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మధుమేహం - ఉల్లిపాయ రసం !
March 11, 2025
0