చెన్నైకు ఎల్లో అలర్ట్ జారీ !

Telugu Lo Computer
0


క్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తెన్కాసి, తిరునెల్వేలి, తూత్తుకుడి నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని  చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆర్ఎంసీ. మంగళవారం చెన్నైలో మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్ప పీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. శివగంగ, పుదుకోట్టై, రామనాథపురం, తిరువారూరు జిల్లాలో కూడా వాన పడే చాన్స్ ఉందని ఆర్ఎంసీ పేర్కొంది. ఈ తుపాన్ ప్రభావంతో బుధవారం కూడా వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)