ఆంధ్రప్రదేశ్ లో ఆడుదాం ఆంధ్రపై ఏసీబీ విచారణ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఆడుదాం ఆంధ్ర పేరు తో భారీ ఎత్తున స్కాం జరిగిందని ఆరోపణలు రావడం తో కూటమి ప్రభుత్వం ఏసీబీ విచారణ కు కీలక ఆదేశాలు ఇచ్చింది . ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరు తో క్రీడల పోటీలు నిర్వహించింది. ఈ వ్యవహారం లో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలోని త్వరలో రోజాఅరెస్ట్ అవటం ఖాయంగా కూడా కనిపిస్తుంది. ఆడుదాం ఆంధ్ర పై నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడుతూ 47 రోజులు 120 కోట్లు మంచినీళ్ళల ఖర్చు పెట్టారన్నారు. అలాగే దీనిపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో నిధులు పక్క దారి పెట్టాయని కూటమి ఎమ్మెల్యేలు చర్చ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు . ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ వ్యవహారం పై ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)