మధుమేహం - ఎర్ర మాంసం

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు 20 దేశాల్లో 31 అధ్యయనాల నుండి 19.7 లక్షల మందిపై మధుమేహ పరీక్షలను నిర్వహించారు. ఈ అధ్యయనంలో వయస్సు, అలవాట్లు, ఆరోగ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ పరిశోధనలో ప్రతిరోజు 50 గ్రాముల ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకునే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15% ఎక్కువగా ఉందని పరిశోధకులు గమనించారు. ప్రతిరోజూ 100 గ్రాముల ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం తినడం వలన డయాబెటిస్ వచ్చే ప్రమాదం 10% పెరుగుతుందని, అలాగే 100 గ్రాముల పౌల్ట్రీ మాంసం తీసుకోవడం వలన డయాబెటిస్ వచ్చే ప్రమాదం 8% పెరిగిందని అధ్యయనంలో పేర్కొన్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రభావం తగ్గించడానికి ప్రాసెస్ చేసిన మాంసం వినియోగాన్ని పరిమితం చేయాలని చెప్పారు. మునుపటి పరిశోధనలలో కూడా, రోజుకు ఒకసారి కంటే ఎక్కువ ఎర్ర మాంసం తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 62% పెరిగిందని తేలింది. కోడి మాంసం, గుడ్ల యొక్క రోజువారీ వినియోగాన్ని 113 గ్రాములకు పరిమితం చేయాలని యుఎస్ అధికారులు సిఫారసు చెప్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాలను వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు తీసుకోవద్దని చెప్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)