ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా మానా గ్రామంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో 57 మంది కార్మికులు మంచులోనే కూరుకుపోయారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాలు ఘటనా స్థలం చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. మంచులో చిక్కుకున్న కార్మికుల్లో 10 మందిని రక్షించి క్యాంప్‌నకు తరలించారు. మిగతా వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం : మంచులో కూరుకుపోయిన 57 మంది కార్మికులు
February 28, 2025
0
Tags