విటమిన్-డి సూర్యకాంతి నుంచి లభిస్తుంది. రోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల సమయంలో ఎండలో నిల్చోవడం ద్వారా విటమిన్-డీని పొందవచ్చు. కానీ ఇప్పుడు బిజీ లైఫ్‌తో ఎండలో నిల్చునే సమయం కూడా ఎవరికీ ఉండటం లేదు. దీంతో చాలా మందికి విటమిన్ డీ లోపం ఏర్పడుతుందేని నిపుణులు చెప్తున్నారు. దీనిని గుర్తించడానికి పలు రకాల టెస్ట్‌లు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఖరీదుతో కూడుకున్నవి. అయితే విటమిన్ డీ లోపాన్ని మనం ఇంట్లోనే ఉండి కూడా గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు. శరీరంలో విటమిన్-డీ లోపిస్తే జుట్టు అధికంగా రాలుతుంది. చాలా మంది జుట్టు రాలుతుంటే జన్యుపరైన సమస్య అనుకుంటారు. పైగా జుట్టు రాలుతున్న సమస్యను లైట్ తీసుకుంటారు. కానీ విటమిన్-డీ లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. ఈ విటమిన్ లోపం తలపై ఫోలికల్స్ ఏర్పడటానికి దారితీస్తుందని, దాని ఫలితంగా జుట్టు సమస్యలు కూడా అనేకం వస్తాయని నిపుణులు చెప్తున్నారు. విటమిన్ డి లోపం వల్ల మనలో ఆందోళన, ఒత్తిడి కూడా అధికం అవుతాయి. ఏసీలో కూర్చుని ఉన్నా చెమటలు పట్టేస్తాయి. ఈ విటమిన్ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి, మెదడుకు సరైన పనితీరుకు చాలా అవసరం. ఈ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తగినంత విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన మరియు నిరాశ కలుగుతాయి. విటమిన్-డీ లోపం వల్ల కండరాల నొప్పులు కూడా వస్తాయి. కొద్దిసేపు నడిచినా అలసిపోతున్న భావన కలుగుతుంది. అమితమైన ఆయాసం వస్తుంది. కొన్ని సార్లు అధిక శ్రమ వల్ల కూడా ఇలానే అనిపిస్తుంది. కానీ విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసటగానే ఉంటుందంటే మాత్రం విటమిన్-డీ లోపంగానే భావించాలని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా విటమిన్-డీ లోపిస్తే కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు.
విటమిన్-డీ లోపం - లక్షణాలు !
February 28, 2025
0
Tags