కాలీఫ్లవర్ - థైరాయిడ్, యూరిక్ యాసిడ్ !

Telugu Lo Computer
0


కాలీఫ్లవర్ ను గోబీ మంచూరి, కూరల రూపంలో తింటారు. కాలీఫ్లవర్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్, యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. ఇది ఈ వ్యాధులను మరింత తీవ్రతరం చేస్తుంది. ప్రసూతి సమయంలో గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి, అందుకే క్యాలీఫ్లవర్ తినకూడదు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ హాని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్‌తో బాధపడేవారు తక్కువగా క్యాలీఫ్లవర్ తినాలి. క్యాబేజీని తినడం వల్ల మెదడులోని నులిపురుగులకు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయట. ఈ పరాన్నజీవులు కలుషితమైన నేల లేదా కలుషితమైన నీటి నుండి కాలీఫ్లవర్‌కు వస్తాయి. ఈ పరాన్నజీవుల గుడ్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి పేగుల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఒక పరాన్నజీవి, ప్రేగు నుండి బయటకు వెళ్లి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కొన్నిసార్లు ఇది మెదడుకు చేరుతుంది, ఇది న్యూరోసిస్టి సెర్కోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. కాలీఫ్లవర్, క్యాబేజీని ఇంటికి తెచ్చిన తర్వాత బాగా కడిగి ఆ తర్వాత, వేడి నీటిలో ఉప్పు కలిపి 30 నిమిషాల పాటు కాలీఫ్లవర్ ఉంచాలి. అప్పుడు క్యాలీఫ్లవర్, క్యాబేజీలోని కీటకాలను చనిపోతాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)