నోటి దుర్వాసన - చిట్కాలు !

Telugu Lo Computer
0


నోటి దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పోషకాహార లోపం కావచ్చు, జీర్ణ సమస్యలు, లేదా బ్యాక్టీరియా వలన వచ్చే సమస్య కావచ్చు. అయితే ఇది అంత పెద్ద సమస్య ఏమీ కాదు. అయినా కానీ మనం నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.  సింపుల్ చిట్కాల్ని పాటిస్తే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

సిట్రిక్ పండ్లులైనా నిమ్మకాయ, ఆరెంజ్ వంటి పండ్లను నమ్మడం వల్ల లాలాజల గ్రంధులు యాక్టివ్ అయ్యి నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఈ పండ్లు తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో  సహజ ఆమ్లం ఉంటుంది. ఇది నోటిలోని జెర్మ్స్, బ్యాక్టీరియాలను చంపడానికి ఉపయోగపడుతుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి, 30 సెకండ్ల పాటు నోటిని క్లీన్ చేసుకోండి. దీనివల్ల దుర్వాసన తగ్గి నోరు శుభ్రం అవుతుంది. బ్రష్ చేసుకునేటప్పుడు, ఆవనూనెతో కొద్దిగా ఉప్పును కలిపి కోమటం వల్ల ఫ్లాక్, క్యావిటీస్ ని నివారించవచ్చు. బావ నూనెతో యాంటీ మైక్రో బయల్గుణం ఉండటంతో బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందకుండా నిలిపివేస్తుంది.  తులసి ఆకులను మలటం వల్ల నోటి దుర్వాసన పోతుంది. ఆకులలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను పోగొట్టి  నోటిని శుభ్రం చేస్తుంది.  తులసి టీ తయారు చేసి తాగితే సమస్య తగ్గుతుంది. భోజనం చేసిన తరువాత సోంపును, దాల్చిన చెక్క, లవంగాలు, పిప్పర్మెంట్లు, తులసి వంటివి నమిలి తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇవి ఏ సహజ సుగందాలను కలిగిన ఔషధాలు. ఇవి నోటిని దుర్వాసన పోగొట్టడానికి మరియు శుభ్రతను కాపాడడానికి ఉపయోగపడతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)