అల్లరి నరేష్‌తో 'మడత కాజా' - 'సంఘర్షణ' వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్ (54) శుక్రవారం ఉదయం మృతి చెందారు. భవన నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న ఆయన సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే అల్లరి నరేష్‌తో మడత కాజా సినిమాతో పాటు సంఘర్షణ సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మాతగా మరో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఆయన అకాల మరణం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టివేసింది. గత కొంతకాలంగా వేదరాజు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.వేదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు శుక్రవారమే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
నిర్మాత వేదరాజు టింబర్ మృతి !
January 31, 2025
0
Tags