డీప్ సీక్‌ని ఉపయోగించకుండా అమెరికా కాంగ్రెస్ ఆఫీసులకు హెచ్చరికలు జారీ !

Telugu Lo Computer
0


మెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్‌ని చైనా ఏఐ టూల్ ''డీప్ సీక్'' షేక్ చేసింది. డీప్ సీక్ దెబ్బకు చాట్‌జీపీటీ వంటి దిగ్గజం కూడా ఆందోళన చెందింది. ప్రస్తుతం ఏఐ పరిశ్రమలో తిరుగులేకుండా ఉన్న అమెరికాకు చైనా ధీటుగా బదులిచ్చింది. ఇదిలా ఉంటే, చైనీస్ చాట్‌బాట్ డీప్ సీక్‌ని ఉపయోగించకుండా అమెరికా కాంగ్రెస్ తన ఆఫీసులకు హెచ్చరికలు జారీ చేసింది. డీప్ సీక్ కాంగ్రెస్ భద్రత, పరిపాలనకు సవాల్‌గా నిలుస్తుందని పేర్కొంది. దీని వలన హౌజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ముందస్తు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డీప్‌ సీక్ ప్రస్తుతం ఉందని పేర్కొన్నారు. చైనీస్ చాట్‌బాట్ కావడంతో అత్యంత విలువైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని అమెరికా భయపడుతోంది. దీనిని ఉద్యోగులు ఎవరూ కూడా ఇన్‌స్టాల్ చేయొద్దని హెచ్చరించింది. అధికారిక ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లలో డీప్ సీక్ ఇన్‌స్టాన్ చేయకుండా సిబ్బందిని నిషేధించింది. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఐ వినియోగాన్ని పరిమితం చేయడం ఇదే తొలిసారి కాదు. 2023లో చాట్‌జీపీటీ వాడకంపై కూడా పరిమితులు విధించారు. నిర్దిష్ట పనుల కోసం పెయిడ్ వెర్షన్ మాత్రమే అనుమతించారు. గత ఏప్రిల్ నెలలో సిబ్బంది మైక్రోసాఫ్ట్ కోపైలెట్ ఉపయోగించకుండా నిషేధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)