ఉప్పు, పంచదార, ప్రోటీన్ సప్లిమెంట్లను ఎంత తగ్గిస్తే అంత మంచిది : ఐసీఎంఆర్

Telugu Lo Computer
0


దేశంలో వ్యాధుల బారిన పడుతున్న వారిలో 56% మంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే వ్యాధులను తెచ్చుకుంటున్నట్టు ఐసీఎంఆర్ వైద్యులు నిర్ధారించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా అకాల మరణాలను బారిన పడకుండా కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ వైద్యులు 148 పేజీల నివేదిక విడుదల చేశారు. వాటిలో మనం తినే ఆహారాల గురించి, తినకూడని ఆహారాల గురించి వివరంగా పొందుపరిచారు. అధిక బరువు ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని, చక్కెరతో నిండిన, కొవ్వు కలిగిన పదార్థాలను తినడం, అత్యంత ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తినడం వల్ల శరీరం బరువు పెరుగుతున్నట్టు వివరించారు. అలాగే శారీరక శ్రమ లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణంగా వివరించారు. ఉప్పు, పంచదార, ప్రోటీన్ సప్లిమెంట్లను ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ కాలం జీవించవచ్చు. అలాగే నూనెలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రోజుకు 20 నుంచి 25 గ్రాముల చక్కెరకు మించి తినకూడదని  వైద్యులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్ల నుంచి కూడా సహజంగా చక్కెర శరీరంలో చేరుతుందని, ఇక బయట నుంచి కూడా చక్కెరను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు వారు వివరించారు. ఎంతో మంది యువత కండలను పెంచుకోవడం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. ఇలా ప్రోటీన్ పౌడర్లను, ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఎముకల్లో ఖనిజాలు నష్టపోవచ్చు. మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రోటీన్ సప్లిమెంట్లను, ప్రోటీన్ పౌడర్లను తినడం మానేయాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. చక్కెర వినియోగించడం తగ్గించి, సమతుల్యత ఆహారం తృణధాన్యాలు, చిరుధాన్యాలు తినడం పెంచుకోవాలి. అలాగే పప్పులు, బీన్స్ వంటివి కూడా తినాలి. కూరగాయలు, పండ్లు, పాలు ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. కొవ్వు ఉండే ఆహారాలను తగ్గించుకోవాలి. నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. 

Post a Comment

0Comments

Post a Comment (0)