తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరింది. శుక్రవారం ఈ మేరకు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 'కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. రైతుబంధు సాయం, రైతురుణమఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ మధ్య విమర్శలు జరిగాయి. అయితే ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ సీఎంకు ఈసీ నోటీసులు ఇచ్చింది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ !
May 10, 2024
0
Tags