కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేట తాలూకా సూర్లబ్బి గ్రామంలో ఎస్ఎస్ఎల్సీ విద్యార్థిని దారుణ హత్యకు గురి కావడంతో ఆప్రాంతంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. 30 ఏళ్ల యువకుడు 10వ తరగతి చదువుతున్న బాలికను అతి కిరాతకంగా హత్య చేసి ఆమె తల నరికి శరీరాన్ని ముక్కలు చెయ్యడం కలకలం రేపింది. సూర్లబ్బి హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న యుఎస్ మీనా (17) అనే యువతిని అతి కిరాతంగా హత్య చెయ్యడంతో పోలీసులు సైతం హడలిపోయారు. సుబ్రమణి, ముత్తక్కి దంపతుల ఏకైక కుమార్తె మీనా. మీనా సూర్లబ్బి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మీనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషంతో గురువారం బంధువులు, స్నేహితులు అందరికి స్వీట్లు పంచిపెట్టారు. మీనా చదువుతున్న స్కూల్ లో 100% ఫలితాలు రావడంతో ఆ పాఠశాలలో కూడా సంబరాలు చేసుకున్నారు. నిందితుడు ఓంకారతో మీనాకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. అయితే మీనా మైనర్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిశ్చితార్థాన్ని నిలిపివేసినట్లు సమాచారం. నిశ్చితార్థం తరువాత పెళ్లి ఆగిపోవడంతో ఓంకార రగిలిపోయాడని తెలిసింది. నిందితుడు ఓంకార ఇంట్లో ఉన్న మీనాను ఆమె తల్లిదండ్రుల ముందే ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి తరువాత కొడవలితో ఆమెను దారుణంగా నరికి చంపేశాడని పోలీసులు తెలిపారు. సోమవారం పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడితో మైనర్ బాలిక మీనా నిశ్చితార్థాన్ని కుటుంబీకులు ఫిక్స్ చేసినట్లు ఎస్పీ కె.రామరాజన్ ధృవీకరించారు. అయితే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మీనా కుటుంబ సభ్యులను సంప్రదించి బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చెయ్యాలని ఒప్పించారు. ఈ కోపంతోనే నిందితుడు ఓంకార్ నిశ్చితార్థం చేసుకున్న మీనాను హత్య చేసి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. మీనాను అతి దారుణంగా హత్య చేసిన ఓంకారకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఉన్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.
పెళ్లి ఆగిపోవడంతో మైనర్ బాలిక దారుణ హత్య
May 11, 2024
0
Tags