బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం చేసే కొంబుచా టీ !

Telugu Lo Computer
0


కొంబుచా టీ తాగితే దివ్య ఔషధం దొరికినట్టే అని చెప్పుకోవాలి. దీన్ని చక్కెర, టీ డికాషన్, ఈస్ట్, బ్యాక్టీరియా ఎంజైమ్స్‌తో తయారు చేసి పులియబెడుతారు. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ప్రోబయోటిక్ లక్షణాల అధికంగా ఉంటాయి. అంతే కాకుండా పులియబెట్టినప్పుడు ఇది సహజ ఆమ్లాలు, ఎంజైమ్స్‌ని విడుదల చేస్తుంది. కాబట్టి ఇది పేగుల ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెబుతున్నారు. అంతే కాకుండా ఇది బరువు తగ్గించేందుకు కూడా సాయం చేస్తుంది.ఎందుకంటే ఇందులో 40 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించేందుకు సాయం చేస్తుంది. దాంతో పాటు ఇందులో ఉండే ప్రో బయోటిక్ లక్షణాలు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. ప్రేగుల్లో సూక్ష్మజీవుల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడంలో ఈ టీ బాగా పని చేస్తుంది. దీన్ని బ్లాక్ టీతో తయారు చేస్తారు. కాబట్టి దీని వల్ల బ్యాక్టీరియా ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా కాబట్టి ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాడీకి హాని చేసే చెడు బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలని తగ్గిస్తాయి. ఇమ్యూనిటీని బలంగా చేసే యాంటీ మైక్రోబయల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది ఈ టీ. ఇక మరో అతిపెద్ద ఉపయోగం ఏంటంటే దీన్ని తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. సోడాలు, జ్యూస్ లలో కంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కొంబుచా టీ హెల్ప్ చేస్తుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)