తెలంగాణలోని ఖమ్మం మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. అమెజాన్ కంపెనీలో జాబ్ వచ్చింది. అయినా దానిని కాదనుకుని ఎంఎస్ చేయాలని అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ ఇటీవలే పూర్తి చేశాడు. వారం క్రితం పట్టా స్వీకరించాడు. తమ కొడుకు ఎదుగుదలను కళ్లారా చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు మురిసిపోయారు. ప్రస్తుతం వారు అక్కడే ఉన్నారు.ఎంఎస్ విజయవంతంగా పూర్తి కావడంతో రాకేశ్ తన స్నేహితులతో కలిసి ఈనెల 8న అమెరికాలోని ఫాసిల్ క్రీక్ జలపాతం చూసేందుకు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తోపాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి జలపాతంలో పడిపోయారు. నీటిలో ముగిని మృతి చెందారు. రెస్క్యూ సిబ్బంది గాలించి 25 అడుగుల లోతులో మృతదేహాలను గుర్తించి వెలికి తీశారు. రాకేశ్‌తోపాటు మృతిచెందిన మరో యువకుడి వివరాలు తెలియలేదు. ఒక్కగానొక్క కొడుకున్న ఉన్నత స్థాయిలో చూడాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అతను ఏదడిగినా కాదనకుండా చదవించారు. కానీ విధి చూసిన చిన్న చూపుతో చేతికి వచ్చిన కొడుకు విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం !
May 12, 2024
0
Tags