ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.. వీటిలో వై. రామవరం మండలంలోని గుర్తెడు, పాతకోట నుండి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించడానికి హెలికాప్టర్ ను సిద్ధం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజవర్గంలో 2 లక్షల 77 వేల. 317 ఉండగా ఇందులో పురుషులు లక్ష 31 వేల 901, స్త్రీలు లక్ష 14 వేల 540 , థర్డ్ జెండర్స్ 16 ఓటర్లు ఉన్నారు. రంపచోడవరం జూనియర్ కళాశాల గ్రౌండ్ ఏర్పాటు చేసిన శిబిరంలో అధికారులకు పోలింగ్ మెటీరియల్ అందజేస్తున్నారు . బస్సుల్లో ఈవీఎం బాక్స్ లను సిబ్బందితో తరలిస్తున్నారు. మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు!
May 12, 2024
0
Tags