ఐసీయూలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ !

Telugu Lo Computer
0


ర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (92) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఏప్రిల్ 29న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర అనార్యోగంతో భాదపడుతున్న ఆయన గత నెల 21వ తేదిన బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చేరారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏప్రిల్ 29న మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చిక్సిత పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలక పాత్ర పోషించారు. పార్టీలో ఆయన ఎన్నో కీలక పదవుల్లో కూడా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్కడ ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని చేపట్టారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గత సంవత్సరం మాజీ సీఎం క్రీయాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వయసు దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. అయితే, ఆయన రాజకీయాలను వీడాలనుకున్న విషయాన్ని బీజేపీ పెద్దగా పట్టించుకోలేదని ఆ సమయంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)