రిజర్వేషన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉండి కన్‌ఫార్మ్ కాకుంటే ఇకపై స్లీపర్‌లో కానీ, ఏసీ కంపార్ట్‌మెంట్‌లో కాని ప్రయాణించే వీలు లేదని రైల్వే శాఖ తెలిపింది. ఈ విధానం మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం బర్త్ కన్ ఫార్మ్ కాకుంటే టికెట్ ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతోందని వెల్లడించింది. కానీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ తీసుకున్న వారు మాత్రం సదరు టికెట్ క్యాన్సిల్ చేసుకోకుంటే మాత్రం జనరల్ కంపార్ట్‌మెంట్‌లోనే ప్రయాణించాలని తెలిపింది. గతంలో టికెట్ రిజర్వేషన్ చేయించుకొంటే అది కన్‌ఫార్మ్ కాకున్నా స్లీపర్ టికెట్ అయితే స్లీపర్‌లో ఏసీ టికెట్ అయితే ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే వీలుండేది.
మే 1 నుంచి అమల్లోకి రానున్న రైల్వే కొత్త విధానం
April 28, 2025
0
Tags