ఫిబ్రవరిలో అమెరికాకు నరేంద్ర మోడీ ?

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఆయనతో మోడీ  మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్య సమస్యలు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య సంబంధాలను ఇవి ప్రభావితం చేసే అవకాశం లేదనది స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి X ప్లాట్‌ఫామ్‌లో మోడీ ఓ పోస్ట్‌ చేశారు. అందులో అమెరికాతో సంబంధాల గురించి ప్రస్తావించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ను అభినందించారు. రెండు పక్షాలూ ఉపయోగకరమైన, నమ్మకమైన పార్ట్‌నర్‌షిప్‌ను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ, వాణిజ్యం, డిఫెన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, ఎనర్జీ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై ట్రంప్‌తో చర్చించినట్లు తెలిపారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లోని పరిస్థితుల సహా ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. త్వరలో ఇద్దరూ కలవాలని నిర్ణయిచుకున్నట్లు స్పష్టం చేశారు. మోడీతో ఫోన్‌ కాల్ గురించి యూఎస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ సమాధానం చెబుతూ సోమవారం భారత ప్రధానితో సుదీర్ఘంగా మాట్లాడినట్లు చెప్పారు. భారత్‌తో యూఎస్‌కు మంచి అనుబంధం ఉందని, వచ్చే నెలలో మోడీ  వైట్‌హౌస్‌కు రావచ్చని తెలిపారు. వచ్చే నెలలో ఫ్రాన్స్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌లో ట్రంప్‌, మోడీ  కలుసుకునే అవకాశం ఉంది. ఇద్దరూ ఈ ఈవెంట్‌కు హాజరవుతామని ప్రకటించారు. అలాగే ఈ ఏడాది చివరిలో క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ భారత్‌కు వస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)