ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావు పేటలోని ఏఎం రెడ్డి కాలేజీలో గ్రీష్మ అనే యువతి బీ ఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలోనే గ్రీష్మకు మల్లికార్జున్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కానీ, ఇటీవల కాలంలో గ్రీష్మ మరో యువకుడితో మాట్లాడుతోందని మల్లికార్జున్ అనుమానం పెంచుకున్నాడు. నీతో మాట్లాడాలని ఉందని గ్రీష్మతో చెప్పి గుత్తికొండ సమీపంలోని అటవీ ప్రాంతానికి రమ్మని ఫోన్ చేశాడు. అది నమ్మిన గ్రీష్మ అక్కడికి వెళ్లగా మల్లికార్జున్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటామాట పెరిగి విచక్షణ కోల్పోయిన మల్లిఖార్జున్ కర్రతో గ్రీష్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గ్రీష్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కేకలు విని స్థానికులు మల్లికార్జున్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలని చికిత్స కోసం నరసరావు పేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మాట్లాడదామని పిలిచి కర్రతో యువతిపై దాడి చేసిన ప్రేమోన్మాది !
January 28, 2025
0
Tags