ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ పెట్టాలని యోచిస్తున్నాం : డీజీపీ ద్వారకా తిరుమలరావు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇతర నేరాలు తగ్గి, సైబర్‌ క్రైమ్‌ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. సైబర్‌ క్రైమ్‌ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణులను ఉపయోగించుకోవడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేస్తే డబ్బులు చెల్లించవద్దు. సైబర్‌ క్రైమ్‌ నిరోధానికి ఏకైక మార్గం అవగాహనే. చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం అని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)