భారత రిపబ్లిక్ డే సందర్భంగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదివారం బెల్ హార్బర్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో అమెరికా అభివృద్ధికి భారత సంతతి ప్రజలు ఇచ్చిన సహకారాన్ని ఆ దేశ చట్ట సభ్యులు, ఉన్నతాధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గౌరవ అతిథులుగా హాజరయ్యారు. దీనిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ తాను భారత్-యూఎస్‌ల అనుబంధ ఉత్పత్తినని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ప్రజాసేవ, చిరు వ్యాపారాల ఉత్పాదకత వంటి రంగాల్లో సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ఇరుదేశాలు తమ దృష్టిని కేంద్రీకరించాయని ప్రశంసించారు. కృత్రిమ మేధను విస్తరించడంలో భారత్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. భారత్‌తో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వాషింగ్టన్ కొత్త గవర్నర్ ఫెర్గూసన్ మాట్లాడుతూ భారతీయులు కేవలం వారి దేశాభివృద్ధికే కాకుండా ప్రపంచ దేశాల అభివృద్ధికి అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారని కొనియాడారు. భారత్‌తో బంధాలు మరింత పెంచుకోవడానికి తాము ఎదురుచూస్తున్నామని అన్నారు.
కృత్రిమ మేధను విస్తరించడంలో భారత్‌తో కలిసి పని చేస్తాం : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
January 28, 2025
0
Tags