టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్న మైక్రోసాఫ్ట్‌ ?

Telugu Lo Computer
0


నబాహుల్యంలో విశేష ఆదరణ పొందిన టిక్‌టాక్‌ యాప్‌ సేవలను అమెరికాలో మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న దీనిని సొంతం చేసుకునేందుకు మిస్టర్‌ బీస్ట్‌గా పిలిచే అమెరికన్‌ యూట్యూబర్‌ జిమ్మీ డొనాల్డ్‌సన్‌, ఎలాన్‌ మస్క్‌తోపాటు ఒరాకిల్‌ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌ చేరింది. టిక్‌టాక్‌తో మైక్రోసాఫ్ట్‌ చర్చలు జరుపుతున్నట్లు స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే దీనిపై అటు టిక్‌టాక్‌ గానీ, మైక్రోసాఫ్ట్‌ గానీ స్పందించలేదు. టిక్‌టాక్‌ కొనుగోలుపై తాను వివిధ కంపెనీలు, నిపుణులతో చర్చిస్తున్నట్లు ట్రంప్‌ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కాగా, అమెరికాలో టిక్‌టాక్‌ సేవలు ఈ నెల 19 నుంచి నిలిచిపోయాయి. చైనా ప్రభుత్వంతో టిక్‌టాక్‌ సంబంధాలపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో 2024లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ ఏడాది జనవరి 19 నాటికి టిక్‌టాక్‌ను బైట్‌డాన్స్ విక్రయించేయాలని, లేదంటే అమెరికాలో నిషేధం ఎదుర్కోవాలనే చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ నెల 20న దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. టిక్‌టాక్ మనుగడ కోసం జాయింట్ వెంచర్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అమెరికాలో 50 శాతం ఓనర్‌షిప్ ఉండాలన్నారు. అలాచేస్తే టిక్‌టాక్‌ను రక్షించవచ్చని, సురక్షితమైన చేతుల్లో ఉంటుందన్నారు. దానిని అగ్రరాజ్యంలో కొనసాగించవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ మరో 75 రోజుల పాటు యాక్టివ్‌గా ఉండేందుకు వీలుకల్పిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలో టిక్‌టాక్‌ కొనుగోలుపై వివిధ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)