పశ్చిమబెంగాల్ లోని అలీపుర్ దువార్ జిల్లాలో అలీపుర్ దువార్ నుంచి సిలిగురి వెళుతున్న గూడ్స్ రైలు రాజభట్ ఖావా వద్ద అడవుల గుండా ప్రయాణిస్తుండగా గూడ్స్ రైలు మూడు ఏనుగులను ఢీకొనటంతో అవి చనిపోయాయి. అలీపుర్‌ద్వార్ జిల్లాలో రాజభట్ఖావా అడవుల్లో సోమవారం ఉదయం 7.20 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో గూడ్స్ ను అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. రైలును సీజ్ చేసిన విషయంపై చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రామ్ మాట్లాడుతూ రైలును సీజ్ చేయటమంటే అది సాంకేతికమైనదని, రైలును భౌతికంగా స్వాధీనపరచుకోవటం కాదని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే రైలు ఉందన్నారు. కానీ పేపర్స్ విషయంలో సీజ్ ప్రక్రియను జరిపామని తెలిపారు. పట్టాలపైకి ఏమైనా అడ్డంగా వస్తే గుర్తించి అప్రమత్తం చేసే ఐడీఎస్ ఈ మార్గంలో లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఐడీఎస్ ఉన్నచోట ఏనుగులను రైళ్లు ఢీకొన్న ఘటనలు లేవని చెప్పారు.
గూడ్స్ రైలును సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు !
November 28, 2023
0
Tags