అమ్మతనానికి మచ్చ తెచ్చిన తల్లి !

Telugu Lo Computer
0


కేరళ లోని తిరువనంతపురంకు చెందిన ఓ మహిళకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, భర్త మానసిక రోగి కావడంతో అతన్ని వదిలేసి పిల్లలతో విడిగా జీవిస్తోంది. ఈ క్రమంలో శిశుపాలన్‌ అనే వ్యక్తితో ప్రేమాయణం మొదలు పెట్టింది. ఈ క్రమంలో తరచూ అతడి ఇంటికి వెళ్లి వచ్చేది. అయితే మహిళ కూతుర్లపై కన్నేసిన శిశుపాలన్‌ వారిని కూడా తన ఇంటికి తీసుకురమ్మని బలవంతం చేశాడు. దీంతో తన పిల్లల్ని కూడా అతడి వద్దకు తీసుకెళ్లింది. అక్కడ ఆ ఇద్దరిపై శిశుపాలన్‌ అఘాయిత్యానికి పాల్పడేవాడు. 2018 – 2019 మధ్య తల్లి ఎదుటే ఆ చిన్నారులపై అనేక సార్లు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయినా ఆ మహిళ అడ్డుకోకపోగా, ప్రియుడికి పూర్తిగా సహకరించింది. తల్లి ప్రవర్తన శిశుపాలన్‌ లైంకిగ వేధింపులకు తట్టుకోలేక ఆ చిన్నారులు ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి అమ్మమ్మ వద్దకు చేరారు. ఆమె పిల్లల్ని ఇద్దర్నీ బాలల సంరక్షణ కేంద్రంలోకి చేర్పించింది. అక్కడ కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పిల్లల తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ సమయంలో శిశుపాలన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా కేరళ స్పెషల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ మేరకు పిల్లల తల్లికి 40 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.20,000 జరిమానా కట్టాలని ఆదేశించింది. నిందితురాలు తన పిల్లల పట్ల వ్యవహరించిన తీరు అమ్మతనానికే అవమానకరమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఆమె క్షమాభిక్షకు అర్హురాలు కాదని పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)