మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్ గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అలర్ట్ చేసింది. ఫైర్‌ఫాక్స్‌లోని భద్రతా సమస్య గురించి వినియోగదారులను హెచ్చరిస్తోంది. ఈ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు డేటాను దోపిడీ చేయవచ్చని, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెబ్‌సైట్‌లోని సెక్యూరిటీ బులెటిన్ ఫైర్‌ఫాక్స్‌తో ఉన్న నిర్దిష్ట సమస్యను వివరిస్తుంది. కాన్షిడెన్షియల్ డేటాకు అనధికారిక యాక్సెస్‌ను పొందేందుకు దానిని ఎలా దుర్వినియోగం చేయవచ్చనే అంశంపై అవగాహన కల్పిస్తుంది. ఫైర్‌ఫాక్స్‌లో కేవలం ఒకటి కాదు, చాలా భద్రతా సమస్యలు ఉన్నాయి. ఇవి వినియోగదారుల డివైజ్‌లను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గుర్తించిన భద్రతా సమస్యలు లా ఫైర్‌ఫాక్స్ స్పెసిఫిక్ వెర్షన్‌లను ప్రభావితం చేస్తాయి. ఇది వినియోగదారులకు ముప్పును కలిగిస్తాయి. CERT-In అలర్ట్‌లో పేర్కొన్న వెర్షన్‌లలో.. 115.5.0కి ముందు వచ్చిన ఫైర్‌ఫాక్స్ ESR వెర్షన్‌లు, 120కి ముందున్న ఫైర్‌ఫాక్స్ iOS వెర్షన్‌లు, 115.5కి ముందు మొజిల్లా థండర్‌బర్డ్ వెర్షన్ ఉన్నాయి. ఫైర్‌ఫాక్స్ సెక్యూరిటీ ఇష్యూల నుంచి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు యూజర్లకు CERT-In కొన్ని సూచనలు చేసింది. బ్రౌజర్‌లు, డివైజ్‌లను ఎలా భద్రపరచుకోవాలో తెలిపింది. వినియోగదారులు తమ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించారు. అప్‌డేట్ చేయడం వలన లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లు అప్లై అవుతాయి, ఏవైనా వల్నెరబిలిటీలు క్లోజ్ అవుతాయి. పొటెన్షియల్ థ్రెట్స్ నుంచి జాగ్రత్తగా ఉండేందుకు వినియోగదారులు ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ని ఎనేబుల్ చేయాలి. తరచూ తలెత్తుతున్న సెక్యూరిటీ ఇష్యూల నుంచి బ్రౌజర్ నిరంతరం పటిష్టంగా ఉండేలా చేస్తుంది. బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు, లింక్‌లు, అటాచ్‌మెంట్‌లతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గుర్తు తెలియని మెసేజ్‌లు లేదా ఇమెయిల్‌లను ఓపెన్ చేయకూడదు. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయడం వలన అనుకోకుండా డివైజ్‌లు భద్రతా ప్రమాదాలకు గురవుతాయి. CERT-In ఇటీవలి కాలంలో వరుసగా వినియోగదారులను అలర్ట్ చేస్తోంది. తాజాగా ఆండ్రాయిడ్‌లోని క్రోమ్, అడోబ్ అనేక ప్రధాన యాప్‌ల సహా భద్రతా సమస్యలపై హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌గా చేసుకోవాలని, డిజిటల్ ఉనికిని కాపాడుకోవడానికి ఉత్తమ పద్ధతులను అనుసరించాలని కోరింది.
ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ వాడేవారికి కేంద్రం అలర్ట్ !
November 28, 2023
0
Tags