గాంధీ మహా పురుషుడు - మోడీ యుగ పురుషుడు !

Telugu Lo Computer
0


ముంబయిలో  జైన ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ''మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. గత శతాబ్దపు మహా పురుషుడు మహాత్మా గాంధీ అయితే ఈ శతాబ్దపు యుగ పురుషుడు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఇద్దరి మధ్య ఒక సారూప్యత కనిపిస్తుంది. ఈ ఇద్దరూ శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీని ఎంతో గౌరవిస్తారు. అని ధన్‌ఖడ్‌ అన్నారు. ''జాతి, దేశ ఎదుగుదలను వ్యతిరేకించే, జీర్ణం చేసుకోలేని శక్తులు ఏకం అవుతున్నాయి. దేశంలో ఏదైనా మంచి జరిగితే ఆ శక్తులు వ్యతిరేకంగా పయనిస్తున్నాయి. ఇలాంటిది ఇక జరగకూడదు. మన ముందు పెను ప్రమాదం పొంచి ఉంది. మన చుట్టూ ఉన్న దేశాల చరిత్ర చాలా చిన్నది. మూడు వందలో, ఐదు వందలో లేదా ఏడు వందల ఏళ్ల చరిత్ర వాళ్లది. కాని మనది 5000 ఏళ్ల నాటి చరిత్ర'' అని ధన్‌ఖడ్‌ అన్నారు. 1867లో గుజరాత్‌లో జన్మించిన శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ ఆధ్యాత్మికవేత్తగా ప్రసిద్ధి చెందారు. జైనిజం, మహాత్మా గాంధీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడంలో రాజ్‌చంద్రాజీ బోధనలు ఎంతగానో తోడ్పాటును అందించాయి. 1891లో శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీని గాంధీ తొలిసారి కలిశారు. అప్పటి నుంచి ఆయన బోధనల పట్ల గాంధీ ఆకర్షితులయ్యారు. గుజరాత్‌లోని ధరమ్‌పుర్‌లో శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ మిషన్‌ ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)