కేజీ మటన్‌ పంచినా ఓడిపోయా !

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ కౌన్సిల్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ప్రజల విశ్వాసం, ప్రేమను చూరగొంటే బ్యానర్లు, పోస్టర్లు లేకుండానే ఎన్నికల్లో గెలవచ్చన్నారు. గతంలో ఓ ఎన్నికలో  తాను కేజీ మటన్‌ పంచినా ఓడిపోయానని చెప్పారు.  'ఎన్నికల సమయంలో కొంతమంది పోస్టర్లు వేసి, తాయిలాలను పంచి గెలుస్తారు. అటువంటి వ్యూహాలను నేను నమ్మను. గతంలో ఓసారి అటువంటి ప్రయోగం చేసి చూశా. ఓటర్లకు కిలో చొప్పున మటన్‌ పంపిణీ చేశా. కానీ, ఆ ఎన్నికల్లో మేం ఓడిపోయాం. అటువంటి వాటితో ఏమీ ప్రయోజనం ఉండదు. ఓటర్లు ఎంతో తెలివైన వారు. ఎవరికి ఓటేయాలో వారికి తెలుసు. రాజకీయ నాయకులు ప్రజల నమ్మకాన్ని సంపాదిస్తే.. ఇలా డబ్బులు పంచడం, తాయిలాలు ఇవ్వడం, బ్యానర్లు, పోస్టర్లపై ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు'' అని గడ్కరీ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురిచేయడానికి బదులు.. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం, వారి ప్రేమను చూరగొనే ప్రయత్నం చేయాలని సూచించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)