ఇంధన ట్యాంకును జారవిడిచిన యుద్ధ విమానం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌నగర్‌ జిల్లాలో ఉన్న బంజారియా బలుశాషన్‌ అనే గ్రామంలో భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బాహ్య ఇంధన ట్యాంకును పైలట్‌.. నేలపైకి జారవిడిచేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. దీనివల్ల నేలమీద ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం కూడా జరగలేదని పేర్కొన్నారు. ఇంధన ట్యాంకు పడిన సమాచారాన్ని జిల్లా ఎస్పీ.. వాయుసేనకు తెలియజేశారు. సాధారణ శిక్షణలో భాగంగా ఈ విమానం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ నుంచి నింగిలోకి పయనమైంది. అది వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ యుద్ధవిమానమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)