ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే టెక్నికల్ వ్యాగన్ లో మంటలు చెలరేగాయి. వ్యాగన్ లో ఆయిల్ టి్న్నులు ఉండటంతో మంటలు అంటుకోవడంతో బోగీ మొత్తం దగ్ధమైంది. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. అయితే, సకాలంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో 9 మంది సిబ్బంది బోగీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏలూరు రైల్వే స్టేషన్ లో టెక్నికల్ వ్యాగన్ లో అగ్నిప్రమాదం
June 11, 2023
0
Tags