వరుణ్, లావణ్య నిశ్చితార్థం జరిగిన తర్వాత అల్లు అరవింద్‌కి సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. అది 'చావుకబురు చల్లగా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పించారు. అందుకే ఆ ఈవెంట్‌కి ఆయన గెస్టుగా వచ్చారు. వేదికపై లావణ్య త్రిపాఠి తెలుగులో ప్రసంగిస్తుండగా వెంటనే అల్లు అరవింద్ ఆమె వద్దకు చేరుకున్నారు. మైక్ అందుకొని ''ఎక్కడో నార్త్ నుంచి వచ్చిన లావణ్య తెలుగు నేర్చుకొని, చాలా బాగా మాట్లాడుతోంది. ఓ తెలుగు కుర్రాడ్ని చేసుకొని, ఇక్కడే సెటిలైతే బాగుంటుంది కదా'' అని చెప్పారు. అప్పుడు ఆయన ఏదో మాట వరసకి అలా అనేశారు. ఇప్పుడు లావణ్య అదే నిజం చేసి చూపించిందని, నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన కుర్రాడినే ప్రేమించి, మెగా కోడలు కాబోతోంది. ఇదిలావుండగా 2016లో శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్' సినిమా షూటింగ్ సమయంలో లావణ్య, వరుణ్ తేజ్ మధ్య పరిచయం ఏర్పడింది. అది కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారింది. అప్పటి నుంచి సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.
అల్లు అరవింద్ సరదాగా అన్నదే నిజమైంది !
June 11, 2023
0
Tags