ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాలపై కేంద్ర కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతోపాటే కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీల, ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదే పదే సమగ్ర కుల ఆధారిత జనాభా గణన కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఆ వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాలంటే ఇది అవసరం అని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. దేశంలో 2011లో పూర్తి స్థాయిలో జనాభా లెక్కింపు జరిగింది. తర్వాత కోవిడ్ మహమ్మారి, సహా ఇతర కారణాలతో 2021లో జరగాల్సిన జనాభా గణన వాయిదా పడింది. కొత్త జనాభా లెక్కింపు విషయాన్ని కేంద్రం వాయిదా వేస్తూ వస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ , కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో కుల గణనను వ్యతిరేకించాయని అన్నారు. "1947 నుంచి కుల గణన జరగలేదు. కాంగ్రెస్ కుల గణనకు బదులుగా కుల సర్వే నిర్వహించింది. యుపిఎ ప్రభుత్వంలో, అనేక రాష్ట్రాలు రాజకీయ కోణంలోనే కులసర్వే చేశారు." అని ఆయన అన్నారు. "కుల గణనను అసలు జనాభా గణనలో చేర్చాలి. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని రాజకీయ వ్యవహారాల మంత్రివర్గం రాబోయే జనాభా గణనలో చేర్చడం ద్వారా కుల గణన చేయాలని నిర్ణయించింది" అని కేంద్ర మంత్రి అన్నారు. కాంగ్రెస్, ఇండీ కూటమి తమ సొంత ప్రయోజనం కోసం మాత్రమే కుల గణన చేస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తదుపరి జనాభా గణనతోపాటు కుల గణనను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ 2025-26 చక్కెర సీజన్ కు చెరకు న్యాయమైన, లాభదాయక ధర క్వింటాకు రూ.355గా నిర్ణయించాం. ఇది బెంచ్ మార్క్ ధర, దీని కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయలేరన్నారు. షిల్లాంగ్ నుంచి సిల్వర్ కారిడార్ కు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మేఘాలయ నుంచి అసోంకు కొత్త రహదారి నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇది 166.8 కి.మీ. పొడవైన 4-లేన్ల రహదారి అవుతుంది.
జనాభా లెక్కలతో పాటు కులగణన : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
May 01, 2025
0
Tags