ప్రారంభోత్సవాన్ని మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారు !

Telugu Lo Computer
0


నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు అంటే ప్రజావాణి అని అభివర్ణించారు. నూతన పార్లమెంటు భవాన్ని ప్రధానమంత్రి ప్రారంభించిన కొద్ది సేపటికే రాహుల్ ఈమేరకు ఒక ట్వీట్ చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాన మంత్రి కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి 'గణపతి హోమం' నిర్వహించారు. తమిళనాడు మఠాథిపతుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పార్లమెంటు భవంతిలోని లోక్‌సభ స్పీకర్ కుర్చీ సమీపంలో రాజదండాన్ని ప్రతిష్ఠించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 20కి పైగా విపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాజ్యాంగాధినేతను పిలవకపోవడం అతిపెద్ద అతిపెద్ద అవమానమని, ప్రజాస్వామ్యంపై నేరుగా జరిపిన దాడి అని విపక్షాలు విమర్శించాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)