నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని !

Telugu Lo Computer
0


దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవంతిని ప్రధాని మోడీ ప్రారంభించారు. అంతకు ముందు సెంగోల్ కు సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని, నూతన పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద ప్రతిష్టించారు. అనంతరం సెంగోల్‌కు మొక్కారు. నూతన పార్లమెంట్ భవన ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదాలను మోడీ తీసుకున్నారు. 12 గంటలకు ప్రధాని వచ్చిన తర్వాత జాతీయ గీతంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. 12.10 నిమిషాలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌ ప్రసంగం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనఖడ్‌లు ప్రసంగించనున్నారు. అనంతరం 12.17 నిముషాలకు పార్లమెంట్‌ చరిత్ర గురించి తెలిపే రెండు లఘచిత్రాలను ప్రదర్శించనున్నారు. అనంతరం 12.38 నిముషాలకు రాజ్యసభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగించనున్నారు. ఒంటిగంటకు 75 రూపాయల నాణేన్ని, స్టాంపును ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడతారు. 2 గంటలకు ముగింపు వేడుక జరగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)