దేశంలో కొత్తగా 10.542 కేసులు నమోదు అయ్యాయి. 38మంది కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల 10 వేలు దాటుతూ వస్తున్న కరోనా కేసులు ఒక్కరోజు మాత్రం కాస్త విరామం ఇచ్చి తగ్గుముఖంపట్టాయి. దీంతో ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి దాని ఉదృతాన్ని పెంచింది కానీ తాజాగా 24 గంటల్లోనే 10,542 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీనితో ఇప్పటివరకు యాక్టీవ్ కేసుల సంఖ్య 63,562కు చేరింది. అంటే దాదాపు లక్షకు కేసులు చేరుకుంటున్నాయంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. కోవిడ్ మహమ్మారిని అరికట్టాలంటే ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేస్తే ఇది మరింతగా విస్తరించి పాతకథను రిపీట్ చేస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. యాక్టివ్ కేసులు 0.14 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 98.68 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తన తాజా కరోనా బులిటెన్‌లో వెల్లడించింది.
దేశంలో కొత్తగా 10,542 కరోనా కేసులు నమోదు
April 19, 2023
0
Tags