నాచారంలో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా రసాయన కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమ లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో విషవాయువులు కూడా బయటకు రావడంతో కొందరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అస్వస్థతకు గురైన కార్మికులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అమోనియో విష వాయువు పీల్చుకుని పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఈ ప్రమాదం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)