ఒడిశాలో వీధి కుక్కలతో పెళ్లి !

Telugu Lo Computer
0


ఒడిశాలోని బాలాసోర్‌  జిల్లాలో దుష్టశక్తులు దరిచేరకూడదని  కొన్ని గిరిజన తెగలవారు తమ పిల్లలకు వీధి కుక్కలతో వివాహాలు జరిపిస్తున్నారు.  బాలాసోర్ జిల్లాలోని సోరో బ్లాక్‌ బంద్‌సాహి గ్రామానికి చెందిన 11 ఏండ్ల తపన్ సింగ్ అనే బాలుడు ఆడ కుక్కను, ఏడేండ్ల వయసు గల లక్ష్మీ ఒక మగ కుక్కను వివాహం చేసుకున్నారు. మైనర్ పిల్లలకు దుష్టశక్తులను పారదోలేందుకే ఇలా వీధి కుక్కలతో పెండ్లి చేశామని గ్రామస్థులు తెలిపారు. హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడలపై దంతాలు కనిపించడం అశుభంగా భావిస్తారు. అందువల్ల కుక్కలతో పెండ్లి చేస్తే వారి నుంచి దుష్టశక్తులు పారిపోతాయని విశ్వసిస్తారు. సమాజ సంప్రదాయాల ప్రకారం తమ గ్రామంలో కుక్కలతో వివాహాలు చేస్తున్నారని గ్యాడ్యుయేట్ అయిన 28 ఏండ్ల సాగర్ సింగ్ చెప్పారు. కుక్కలతో పెళ్లి నిశ్చయమైన తర్వాత జరిగే చెడు కుక్కలకి చేరుతుందని తమ వారు నమ్ముతారని తెలిపారు. అయితే ఈ విశ్వాసాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, ఆ మూఢనమ్మకం మాత్రం కొనసాగుతున్నదని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)