కొర్రమీను - ఆరోగ్య ప్రయోజనాలు

Telugu Lo Computer
0


వైరల్ ఫిష్ లేదా స్నక్ హెడ్ ముర్రెల్ ని కొర్రమీను అని కూడా పిలుస్తారు. ఇవి చిత్తడి ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. నీరు లేకున్నా, ఎక్కువ కాలం భూమిపై ఈ చేపలు జీవిస్తాయి. ఈ రకం చేపల్లో ముళ్లు, ఎముకలు ఉండవు. ఇది ఎక్కువగా డెల్టా జిల్లాల్లో కనిపిస్తుంది. దీనికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి అత్యధిక ధర పెట్టి ఈ రకం చేపలను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.  ఈ రకం చేపలు ప్రోటీన్ మూలం. ఇందులో ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్, కాల్షియం, భాస్వరం, ఐరన్ , సెలీనియం , పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే అధిక ప్రోటీన్ కారణంగా ఇది కండరాల పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. అదేవి విధంగా ఈ చేపలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఇందులోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)