దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. గవాయ్‌పై షూ విసిరాడు. దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. 'సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే' అని అరుస్తూ ఓ న్యాయవాది దాడికి పాల్పడ్డాడు. అయినా కూడా గవాయ్ ఏ మాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ఏ మాత్రం ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి ప్రశాంతంగా ఉండిపోయారు. అనంతరం విచారణను యథావిధిగా కొనసాగించేశారు. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతోంది. ఓ న్యాయవాది వేదిక దగ్గరకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అడ్డుకున్నారు. అనంతరం న్యాయవాదిని కోర్లు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్తుండగా న్యాయవాది ''సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే'' (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అంటూ అరుస్తూ కనిపించాడు.
ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పైకి షూ విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది !
October 06, 2025
0
Tags