మధుమేహం - కోడిగుడ్డు

Telugu Lo Computer
0


ధుమేహాన్ని సరైన ఆహారం, వ్యాయామంతో దీనిని పూర్తిగా నియంత్రించుకోవచ్చు. కోడి గుడ్లలో బయోటిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపదు. షుగర్ ఉన్నవారు మితంగా గుడ్లు తినవచ్చు. నిపుణుల సూచనల ప్రకారం మధుమేహ బాధితులు వారంలో రెండు నుంచి మూడు గుడ్లు మితంగా తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రెండు మాత్రమే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గుడ్డు తెల్లసొన మాత్రమే తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు గుడ్లు తినే ముందు వైద్యులను సంప్రదించాలి. మధుమేహ నియంత్రణ కోసం అధికంగా నీళ్లు తాగడం, ఒత్తిడికి లోనుకాకుండా వుండడం, తగిన నిద్ర పోవడం, తాజా కాయగూరలు, పండ్లు, సిరిధాన్యాలతో తయారైన ఆహారం తీసుకోవడం, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం మంచిది. 

Post a Comment

0Comments

Post a Comment (0)