డార్క్ చాక్లెట్ - ఆరోగ్య ప్రయోజనాలు

Telugu Lo Computer
0


డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్​ను తటస్థం చేయడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెం ట్లు కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయని, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగ నీస్..ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు, దంతాలను ఆరోగ్ గా ఉంచడంతో పాటుగా నిద్రకు దోహదం చేయడానికి ఉపయోగపడతాయి. ఇందులోని ఫ్లేవనాయి హృదయ ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మేళ లు రక్తపోటును తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని, దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకో డం వల్ల అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి వంటి ఇతర మెదడు సంబంధిత రుగ్మతల నుంచి కూడా రక్షణను అందిస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్  పేర్కొంది. డార్క్ చాక్లెట్ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. కొకోవా ని ఎపికాటెచిన్ అనే సమ్మేళనం శరీరం ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా ఉపగించుకోవ నికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్​ చాక్లెట్ బరువు తగ్గడానికి సహాయపడు తుందని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)